హైమస్ లైట్స్ ను ప్రారంభించిన కాంగ్రెస్ అధ్యక్షులు బాల్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పులిచెరు కుంట కట్ట మైసమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్ ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో గల పులిచేరు కుంట కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఒక హైమాస్ లైట్ కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగానే నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్ డి ఎఫ్ కింద నిధులు మంజూరు చేసి హైమాస్ లైట్ ఇప్పించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రేపటినుండి మూడు రోజులపాటు పులిచేరు కుంట కట్టమైసమ్మ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా హోమ అన్నదానం,మైసమ్మ పోచమ్మ,బోనాల కార్యక్రమాలు ఉన్నాయన్నారు.

పట్టణ ప్రజలు మండల వ్యాప్తంగా ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందరూ మైసమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరనీ కమిటీ సభ్యులు కోరారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు, అమ్మవారి జాతర మహోత్సవ పత్రికను అందించి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్, నరేష్, తాళ్ల విజయ్ రెడ్డి, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య, మండల ఉపాధ్యక్షులు తాడేపు కొమరయ్య,సీనియర్ నాయకులు ఆగుల్ల రాజేశం, ఉచ్చిడి బాల్ రెడ్డి,మదాసు అనిల్, అన్నం శ్రీధర్ రెడ్డి, దశరథం, పులిచేరు కుంట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నేడే అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలకు చేరుకున్న భార్య స్నేహరెడ్డి!