మ‌రో సంచ‌ల‌న పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కాంగ్రెస్‌..

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్, శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చింది.

ఇకపోతే రేవంత్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకుగాను తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలను నిర్వహిస్తున్నారు.ఈ సభలకు జనం బాగానే వస్తున్నారు.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ సభ సక్సెస్ అయినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ మరో సంచలన పోరుకు సిద్ధమవుతోంది.రాష్ట్రంలో దళిత, గిరిజన, ఆదివాసీల సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ నిరుద్యోగ సమస్యపైన పోరాటం చేయబోతున్నది.

‘నిరుద్యోగంపై పోరు’ను అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ప్లాన్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.

"""/"/ ఈ నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో పర్యటిస్తారని, మేధావులు, యువత, నిరుద్యోగులను ఐక్యం చేస్తారని చెప్పారు.

విద్యార్థి, నిరుద్యోగల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరు జరపబోతున్నదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని అన్ని వర్గాల పక్షాన నిలబడి అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో గతంతో పోల్చితే ప్రస్తుతం సీనియర్ నేతల మధ్య ఐక్యత వచ్చిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత వీహెచ్ గజ్వేల్ సభలో కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది.

మొత్తంగా రేవంత్ ప్లాన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.

దళిత, గిరిజన, ఆదివాసీ‌ల కోసం సభలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ నిరుద్యోగులు, యువత, విద్యార్థుల పక్షాన నిలబడే ప్రయత్నం చేయబోతున్నది.

చూడాలి మరి.ఈ క్రమంలో ఆయా వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎలా తన వైపునకు తిప్పుకోబోతుందో.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు