కాంగ్రెస్ గతం : టిఆర్ఎస్ భవిష్యత్తు! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వాట్ తెలంగాణ థింక్స్ టుడే పేరుతో ప్రధాన మీడియా టీవీ 9 ఒక మెగా కాన్ క్లేవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దానిలో నిన్న పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కాంగ్రెస్ పార్టీపై సంచల వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ వస్తే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటుందని , బెంగళూరులో కాంగ్రెస్ పాలనలో 28% రియల్ ఎస్టేట్ పడిపోయిందని గణాంకాలు ఉన్నాయని, అసలు ఇందిరమ్మ రాజ్యం అంటేనే గంజి కేంద్రాలు, నక్సలైట్లు, నిరుద్యోగం,ఆకలిచావులు అన్నారు కేటీఆర్.

మరో వైపు కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో ప్రతిస్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ), నిజంగా బిఆర్ఎస్ ఆ స్థాయిలో అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి తప్ప కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తున్నారని, ఈ తెలంగాణలో గ్రూపు లెవల్ జాబుల కోసం పది సంవత్సరాలు పాటు యువత ఎందుకు ఎదురు చూడాలని బట్టి ప్రశ్నించారు.

"""/" / తాము వోడిపోబోతున్నామని కేసీఆర్, కేటీఆర్లకు అర్థమయిపోయిందని అందుకే కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే బ్యాంకులను జాతీయకరణ ,ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్లు చేసి పేదలకు న్యాయం చేసిన రాజ్యమని, కొన్ని లక్షల మందికి భూములను పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దే అని ఆయన చెప్పుకొచ్చారు .

"""/" / మరోవైపు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) కూడా కాంగ్రెస్ ,బి ఆర్ఎస్ లు రెండూ కుటుంబ పార్టీలని , ఇప్పుడు 25 నుంచి 35 సంవత్సరాల యువత బిజెపి రావాలని కోరుకుంటుందని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా కేసీఆర్ కుటుంబం మార్చేసిందని , విపరీతమైన అవినీతి ప్రబలిందని ,తెలంగాణ ప్రజలుఅన్నీ గమనిస్తున్నారు.

ఆత్మగౌరవ తెలంగాణ ను బానిసలాగా మారుస్తానంటే అంటే ఎవరూ ఒప్పుకోరని, వారి సంక్షేమ పథకాల ఫలాలు పొందిన వారు కూడా బి ఆర్ఎస్ కు ఓటు వేయరని తేల్చేసారాయన .

బంగ్లాదేశ్ ప్రజలకు వణుకు పుట్టిస్తున్న ఆ జాతి పాము..?