బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన..!!
TeluguStop.com
అక్టోబర్ 30వ తారీఖున బద్వేల్ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే మృతుడి భార్యకు వైసిపి టికెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేన పార్టీ లు పోటీకి దూరంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో.బద్వేల్ ఉప ఎన్నికకు జనసేన పార్టీ దూరంగా ఉంటున్నట్లు ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలని తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ నాయకులతో చర్చించి బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదని తెలిపారు.
ఇటువంటి తరుణంలో ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి అనుకున్న సమయంలో నిన్న ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
కచ్చితంగా బద్వేలు ఉప ఎన్నికలలో బిజెపి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.మరోపక్క ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా తాజాగా బద్వేలు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయింది.
ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో పోటీ చేస్తోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని, భయంకరంగా అప్పులు ఊబిలో కూరుకుపోయిందని.
శాంతి భద్రతలు కూడా రాష్ట్రంలో కరువయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.