కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి తహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహాసిల్దార్ కి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించాలనన్నారు.

నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను, స్లీపర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

హామీలు అమలు చేసేంతవరకు నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ఆఫీస్ సబార్డినేటర్ చేకూటి అనుష్ యాదవ్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు బాలకిషన్, పొన్నవేని సురేష్, బీజేవైఎం మండల కార్యదర్శిలు ఎలేందర్, చందు, బిజెపి మండల సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్, బిజెవైఎం నాయకులు గంట చరణ్, నవీన్ నాయక్, పొన్నం పవన్, నవీన్, శ్రీకాంత్, నిమ్మల సాయి, బాబు తదితరులు పాల్గొన్నారు.

మందారంతో హెయిర్ ఫాల్ కు ఈజీగా చెప్పండి బై బై!