కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే..బీజేపీ నేతల పై సీరియస్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే బీజేపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ స్వాతంత్రం కోసం ఇంకా ఐక్యత కోసం బీజేపీ పార్టీకి చెందిన ఒక్కరు కూడా ప్రాణ త్యాగాలు చేయలేదని తెలిపారు.

బీజేపీ పార్టీల నాయకుల ఇళ్లల్లో కనీసం కుక్క కూడా పోరాడలేదని.ఇటీవల రాహుల్ "భారత్ జోడో" పాదయాత్ర నేపథ్యంలో రాజస్థాన్ లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో పెను దుమారం రేపాయి.బీజేపీ నాయకులు ఖర్గే వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో బీజేపీ పార్టీ నేతలపై మల్లిఖార్జున్‌ ఖర్గే సీరియస్ అయ్యారు.

తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు.వీటిపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని.

స్పష్టం చేశారు.ప్రతిదానికి క్షమాపణ కోరడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

కాగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని.

కేంద్రమంత్రులు పీయూష్‌ గోయెల్‌, కిరణ్‌ రిజుజు, ప్రహ్లాద్‌ జోషి ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

అయినా ఖర్గే మాత్రం అదరలేదు, బెదరలేదు.క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.