నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపుకు ఆ పార్టీ మద్దతు కోరిన కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న తీవ్ర ఆధిపత్య పోరుతో రగిలిపోతోంది.ఒకప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే బీజేపీ ప్రభుత్వం పై మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ కాంగ్రెస్ కంటే బీజేపీ బలంగా తయారయింది.

అయితే ఎవరైతే టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న వర్గాల పక్షాన కాంగ్రెస్ నిలవకపోవడంతో బీజేపీ ఆశ్రయం తీసుకున్నారు.

అందుకే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు మహాశ యులు బీజేపీకి పట్టం కట్టారు.

కాంగ్రెస్ వైపు మద్దతుగా నిలబడలేదు.అయితే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.ఈ ఎన్నికలో ఒడిపోతే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని తీవ్ర స్థాయిలో ప్రచారం చేసే అవకాశం ఉంది.

అయితే కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికలో విజయం సాధించాలంటే ఏమేమి అస్త్రాలు ఉపయోగించాలో అన్నీ ఉపయోగిస్తొంది.

అయితే కాంగ్రెస్ నాగార్జున సాగర్ గెలుపుకు వామపక్షాల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కూడా దుబ్బాక తరహాలో రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?