ముస్తాబాద్ సబ్ స్టేషన్ వద్ద కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ముస్తాబాద్ మండలంలోని సబ్ స్టేషన్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలపడం జరిగింది.

అలాగే పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశం వద్ద ఆవుపేడతో శుభ్రం చేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న అమెరికాలో ఎన్నారై లతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్న సందర్భంలో కరెంటు విషయమై వారు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కేటీఆర్, మంత్రులు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం మంది చిన్న,సన్నకారు రైతులు ఉన్నారని కావున ఒక ఎకరా కి గంట సేపు నాణ్యమైన విద్యుత్ ని ఇస్తే పొలం పారుతుందని అలా రోజుకి 8 నుండి 9 గంటల విద్యుత్ ఇస్తే పొలాలు పారుతాయని,ఈ 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ కమిషన్లు దండుకుంటున్నాడని ఆరోపించారు.

ఈ మాటలని వారికి అనుకూలంగా వక్రీకరించుకొని వారి మీడియాలలో ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ సమాజం అన్ని నిశితంగా గమనిస్తుందన్నారు.

మీ పాలనకు చరమగీతంపాడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.ఉచిత విద్యుత్ పేరుతో పక్క రాష్ట్రాల నుండి కరెంటును అత్యధిక ధరకు కొనుగోలు చేసి కమిషన్లు దండుకుంటున్న మీరు ఈరోజు మాట్లాడుతున్నారా అని అన్నారు.

తెలంగాణ డిస్కములను దాదాపు 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని ఈ 24 గంటల ఉచిత విద్యుత్ వస్తుందా లేదా అని క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళితే తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పై సిట్ విచారణ జరిపిస్తామ న్నారు.

ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.మీరు రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని,మీరు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకొని రైతు రుణమాఫీ చేసి రైతులకు సబ్సిడీ ద్వారా అందాల్సిన వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలోఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్,ముస్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు,జిల్లా కార్యదర్శులు కొండం రాజి రెడ్డి, లింగంపల్లి ఎల్లా గౌడ్,మిర్యాల కారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్ర రాములు,చికోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, బంధనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు రంజిత్,నామపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నె బాను, గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సడుమల బాలయ్య, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గాంత రాజు, సేవలాల్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు మున్నా, వెంకట్రావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, ముర్రాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్, సీనియర్ నాయకులు వెలుముల రాంరెడ్డి,దీటి నర్సింలు, అరుట్ల మహేష్ రెడ్డి, మాదాసు అనిల్,వంగమోహన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు రంజాన్, నరేష్, తాళ్ళ విజయ్ రెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఎదునూరి భానుచందర్, కమ్మరి శ్రీనివాస్,సిద్ధారెడ్డి, రామచంద్రం,గూడ లక్ష్మారెడ్డి, గంగాధరి, రమేష్,ముక్క నరసయ్య,కరెడ్ల అమర్,కరెడ్ల నవీన్ రెడ్డి, ఇరుగు ప్రేమ్ కుమార్, బాదావత్ రమేష్ నాయక్,లకావత్ రమేష్, లకవత్ మహేష్,జంగిటి బాలరాజ్,దాప మహేష్, మాలోతు సురేందర్ నాయక్, సాయి గౌడ్, వెంకట్రావుపల్లి కరుణాకర్,ఆరుట్ల రాకేష్, మెరుగు శివ గౌడ్, తాడేపు శ్రీనివాస్,దికొండ దశరథం, పోతారం వంశీ, గుగ్గిళ్ళ కళ్యాణ్, మారుతి,చరణ్, సాధన శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?