కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది కరీంనగర్ కు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక కార్యకర్త సైనికుడిలా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని అన్నారు.
ఎంపీ ఎలక్షన్లో బూత్ వైజ్ గా కష్టపడి పని చేసిన కార్యకర్తకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాల్రెడ్డి, సూడిద రాజేందర్,మాజీ జెడ్పిటిసి ఏలూరు రాజయ్య, దత్తాత్రే గౌడు,మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాల్రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,గుండాడి రాంరెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, శోభ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్25, సోమవారం 2024