రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేయడం పట్ల ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచాడని దిష్టిబొమ్మలు దహనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
గతంలో కేటీఆర్ మహిళల పట్లమాట్లాడిన మాటలు చూస్తే చాలా సిగ్గుపడవలసిన అవసరం ఉందన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల నియోజకవర్గం లో దౌర్జన్యం చేస్తున్నారని వారి అరాచకాలు ఇక ఎంతవరకు సాగవన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని కెసిఆర్,కేటీఆర్ దిష్టిబొమ్మలను తాము కూడా దహనం చేస్తామన్నారు.
శాసనసభలో మాట్లాడే మాటలలో విధానం ఉంటుందని దానిని బయటకు తెచ్చి గుండాయిజం చలా ఇస్తామని చూస్తే ఊరుకోమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు చెన్నిబాబు, గుండాటి రామ్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?