మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల ఉమ్మడి నియోజకవర్గంగా,ఉప ఎన్నికతో దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చి,ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ తో రికార్డ్ నెలకొల్పిన మునుగోడు నియోజక ప్రజలు మళ్ళీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపించి,మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించారు.
2022 బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలు ఏడాది తిరిగకముందే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడింది మునుగోడు అభివృద్ధి కోసమేనని ప్రజలు బలంగా విశ్వసించడం,
రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత అభిమానులు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చినా భారీ మెజారిటీతో గెలిపించారు.
కమ్యూనిస్టుల పొత్తు కాంగ్రెస్ కు కలిసివచ్చిందనే చెప్పాలి.కాగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నాయకులనే ఇబ్బందులకు గురి చేయడంతో పార్టీ వీడి కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు.
సొంత పార్టీ నాయకులను సమన్వయ పరుచుకోవడంలో కూసుకుంట్ల ఘోరంగా విఫలమయ్యారని తెలుస్తుంది.కొంతమంది అసంతృప్తులు బీఆర్ఎస్ లోనే ఉంటూ క్రాస్ ఓటింగ్ చేపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కంగువా సినిమాలో ఏఐతో డబ్బింగ్.. ఈ ప్రయోగం వల్ల లాభమా? నష్టమా?