పొంగులేటికి కాంగ్రెస్ ‘పెద్ద’ పనే అప్పగించినట్లుంది!
TeluguStop.com
వైకాపా తో రాజకీయ అరంగేట్రం చేసిన ఖమ్మం జిల్లా నాయుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) తక్కువ సమయంలోనే మూడు పార్టీలు మారాడు.
ఆయన ఏ పార్టీ లో ఉన్నా కూడా ఖమ్మం జిల్లా( Khammam ) ప్రజలు ఆయన వైపు నిలుస్తారు అనడంలో సందేహం లేదు.
తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురి అయిన పొంగులేటి శ్రీనివాస్ ఈ మద్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు.
"""/" /
బీజేపీ లో ఆయన జాయిన్ అవుతాడు అంటూ వార్తలు వచ్చాయి.
అంతే కాకుండా షర్మిల పార్టీ లో కూడా ఆయన జాయిన్ అవుతాడు అనే వార్తలు వచ్చాయి.
చివరకు ఆయన కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యాడు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం లో భారీ సభ ను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ని రప్పించి మరీ పార్టీ లో చేరడం జరిగింది.
ఖమ్మం వరకు పరిమితం అవ్వకుండా రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా వ్యవహరించాలని ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం అందుతోంది.
"""/" / అందులో భాగంగానే ఆయన కోమటి రెడ్డి.ఈటెల తో పాటు మరి కొందరు బీజేపీ నాయకులు ఇంకా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇంకా మంత్రులతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవ్వాలని కోరుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న మంచి పేరు కారణంగా ఆయనతో భేటీ కి మరియు ఆయన ప్రతిపాదనను స్వీకరించేందుకు చాలా మంది నాయకులు ఆసక్తిగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ లోకి ఎంత మందిని తీసుకు వస్తే అంతగా పొంగులేటి బలం ఆ పార్టీ లో పెరుగుతుంది.
ఏకంగా ముఖ్య మంత్రి అభ్యర్థి గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.అందుకే పొంగులేటి ఇతర పార్టీ కి చెందిన పెద్దలను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆయన ఒక పది మంది ఎమ్మెల్యే లను తీసుకు వచ్చినా కూడా విజయం సాధించినట్లే.
రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. పారితోషికం ఎంతంటే?