కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ కూడా రాదు – జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్ల మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని జడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు అన్నారు.

ఎల్లారెడ్డిపేటలోని జెడ్పిటిసి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోవడం ఖాయమని, వారు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు.

అబద్దాల పునాదిపై గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చి గద్దెనెక్కి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని వారు దుయ్యబట్టారు.

అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలు ప్రభుత్వం పైన ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు.

కెసిఆర్ చేసిన బస్సు యాత్ర వల్ల జాతీయ పార్టీలో వణుకు మొదలైందని వారికి భయం పట్టుకుందని అన్నారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, ఎన్నికల ముందు క్వింటాల్ వరి ధాన్యానికి 5 00 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే 500 బోనసిస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని ఆరోపించారు.

ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ,రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరుస కృష్ణ హరి,ప్యాక్స్ చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి, ఏ ఎం సి మాజీ చైర్మన్లు అందె సుభాష్,కొండా రమేష్, నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిల్లి కిషన్, రాజు నాయక్, తిరుపతి నాయక్, దేవరాజు, సిత్య నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు, శివారెడ్డి, పుణ్య నాయక్,సురేష్, బాలు నాయక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరో రోజు కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన దేవర.. ఏకంగా అన్ని రూ.కోట్లు వచ్చాయా?