కంగనా వ్యవహారంలో ‘షా’ తీరు పై తృణమూల్ నేత అభ్యంతరాలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన తరువాత కంగనా బాలీవుడ్ లో నేపోటిజం పై అలానే బాలీవుడ్ ప్రముఖులకు రాజకీయ అండదండలు ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అటు శివసేన వర్గానికి, కంగనా కు మధ్య రచ్చ మొదలైంది.

దీనితో ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకోవడం దానికి తోడు కంగనా సవాళ్లు విసరడం ఇలా ఎదో ఒక చర్చ వారి మధ్య నడుస్తుంది.

ఈ నేపథ్యంలోనే కంగనా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ను చూస్తుంటే ముంబై మరో పీవోకే లా తయారయ్యింది అంటూ వ్యాఖ్యలు చేసింది.

దీనితో సేన వర్గం మరింత గుర్రు మంటూ ఆమెను ముంబై లో అడుగుపెట్టనివ్వం అని,వస్తే రాడ్ల తో,కర్రలతో కొడతాం అంటూ హెచ్చరికలు కూడా చేశారు.

దీనితో సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నా ఎవరు ఆపుతారో ఆపుకోండి అంటూ ఆమె తిరిగి సవాల్ విసిరింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కంగనా కు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పుడు ఈ ఘటన పై తృణమూల్ కాంగ్రెస్ ఏపీ మహువా మొయిత్రా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక బాలీవుడ్ ట్విట్టర్ యూజర్ కు అంత భద్రత ఎందుకు అంటూ ఆమె ప్రశ్నించారు.

దేశంలో లక్షమంది జనాభాకు 138 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.

అలాంటిది ఒక ట్విట్టర్ యూజర్ కు వై కేటగిరి భద్రత కల్పించడం అవసరమా అంటూ ఆమె ప్రశ్నించారు.

కంగనా భద్రత విషయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను టార్గెట్ చేస్తూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

దేశంలోని వనరులను సక్రమంగా వినియోగించడం ఇలాగేనా? అంటూ షాను ఆమె నిల‌దీశారు.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి