24 గంటల కరెంట్‎పై కేటీఆర్‎కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సవాల్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.

లాగ్ బుక్ లు తీసుకువచ్చి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపించాలని తెలిపారు.

రాష్ట్ర ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికి తాను సిద్ధమని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

గృహాలక్ష్మీ పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రకటించిన పథకాలన్నీ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమేనని విమర్శించారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడొద్దని ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోమటిరెడ్డి సూచించారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!