సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్..!!

తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణలో .

ఉన్నది సీఎం కాదని.ప్రజల మాట వినని రాజు అని.

రాజరిక పాలన, నియంత పాలన జరుగుతుందని.నిన్న వరంగల్ లో జరిగిన మహాసభలో రాహుల్ పరోక్షంగా కేసీఆర్ పై కామెంట్లు చేయడం తెలిసిందే.

ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించి.తెలంగాణను దర్శనికుడైన కేసిఆర్ పాలిస్తున్నారు అని.

మీ మూర్ఖుల గుంపుతో.మీరు ఏం ఆఫర్ చేస్తారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాహుల్ గాంధీ కాలిగోటికి కూడా ప్రకాష్ రాజు సరిపోడని అన్నారు.అంతమాత్రమే కాదు ప్రకాష్ రాజ్ కి సినిమాలు లేవని అన్నారు.

అందువల్లే సులువుగా రాజ్యసభ పదవి వచ్చే చోటు ఆయన చేరరాని స్పష్టం చేశారు.

కెసిఆర్ గురించి ప్రకాష్ రాజ్ కి ఏం తెలుసు అని ప్రశ్నించారు.ఏదో ఒక రోజు ఇదే కేసీఆర్ నీ ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం కూడా గ్యారెంటీ అని అన్నారు.

వరంగల్ సభ విజయవంతం కావడంతో రాహుల్ ప్రజల్లోకి పోకూడదని ఉద్దేశంతో.తెలంగాణ ప్రభుత్వం అన్ని వార్తాపత్రికలలో ఫస్ట్ పేజ్ లో యాడ్స్ ఇవ్వటం జరిగిందని ఆరోపించారు.

ముమ్మాటికీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం చేస్తామని పేర్కొన్నారు.అప్పట్లో సమైక్యాంధ్ర అని ఎవరైతే అన్నారో.

వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.