ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయానికి మంత్రి పొంగులేటి.. తెలుగు తమ్ముళ్లకి ధన్యవాదాలు
TeluguStop.com
ఖమ్మం జిల్లాలోని టీడీపీ కార్యాలయానికి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Congress Minister Ponguleti Srinivas Reddy ) మర్యాదపూర్వకంగా వెళ్లారు.
దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలనే ప్రజాభీష్టాన్ని నెరవేర్చడంలో తెలుగు తమ్ముళ్ల పాత్ర కీలకమైనదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
రాజకీయంగా టీడీపీకి ఎటువంటి లాభం లేకపోయినా ప్రజల కోసం తమకు మద్ధతు తెలిపారన్నారు.
"""/"/
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు( TDP Telugu Leaders ) పూర్తి మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాలనుకున్న కల సాకారమైందన్న మంత్రి పొంగులేటి అది కేవలం టీడీపీ నేతల వలనేనని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదమరచి నిద్రపోయారేమో కానీ.
టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎక్కడా నిద్రపోలేదన్నారు.ఆ ఫలితంగానే గత ప్రభుత్వ అహంకారపూరిత నిర్ణయాలకు చరమగీతం పాడామని తెలిపారు.
"""/"/
ఈ క్రమంలోనే టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్( Chandrababu Naidu,Nara Lokesh ) తో పాటు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, తెలుగు తమ్ముళ్లకు కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ క్యాడర్ చేసిన సహకారాన్ని హస్తం పార్టీ ఏనాటికీ మర్చిపోదని వెల్లడించారు.మీరు వేరు .
కాంగ్రెస్ వేరు కాదన్న మంత్రి పొంగులేటి కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్నప్పటికీ తెలుగు తమ్ముళ్ల సాయాన్ని మరవదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్ రాజకీయాల్లో అంతా కలిసి ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి నేత .. ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?