కే‌సి‌ఆర్ కు గట్టి దెబ్బే.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ !

తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇక్కడి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై నువ్వా నేనా అన్నట్లు పట్టుదలగా ఉండడంతో ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో విశ్లేషకులు సైతం అంచనా వేయలేక పోతున్నారు.

ఇదిలా ఉంచితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యమ దూకుడుగా ఉంది.కర్నాటక ఎన్నికల విజయం తరువాత కొత్త ఉత్సాహంతో ఉన్న హస్తం నేతలు బి‌ఆర్‌ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం అనగానే ఒక్క కే‌సి‌ఆర్( CM KCR ) పేరే ప్రధానంగా వినిపిస్తుంది.

కానీ ఉద్యమ సమయంలో కే‌సి‌ఆర్ మాత్రమే కాకుండా ఎంతో మంది సమిష్టి కృషి ఉంది.

"""/" / దాంతో చాలమందికి తగిన ప్రదాన్యం దక్కలేదని ఉద్యమ సమయంలో పాల్గొన్న నాయకుల నుంచి అసంతృప్త మాటలు వినిపిస్తూనే ఉంటాయి.

ఇక్కడే హస్తం పార్టీ మాస్టర్ ప్లాన్ కు రెడీ అయింది.ఉద్యమ సమయంలో పాల్గొని గుర్తింపు లేని నాయకులే టార్గెట్ గా గాలం వేసే పనిలో ఉంది.

ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్ ( Kodandaram ), ఇందిరా శోభన్, ప్రజా గాయకుడు గద్దర్, ఇన్నయ్య వంటి ఉద్యమ కారులను పార్టీలోకి ఆహ్వానించే దిశగా వ్యూహాలు రచిస్తోంది.

వీరంతా కూడా పార్టీలో చేరితే కే‌సి‌ఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడే అవకాశం ఉంది.

"""/" / ఉద్యమాన్ని తనకు ఫేవర్ గా కే‌సి‌ఆర్ ఎలా మలచుకున్నాడో ప్రజలకు స్పష్టంగా వివరించే అవకాశం లేకపోలేదు.

అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న వీరి చేరికలు.రాబోయే రోజుల్లో నిజంగానే హస్తం గూటికి చేరతారా ? లేదా అనేది కూడా సస్పెన్సే.

మొత్తానికి కర్నాటక ఎన్నికల్లో లబించిన జోష్ ను తెలంగాణలో కూడా కొనసాగిస్తూ విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ.

మరి హస్తం పార్టీ ఆశిస్తున్నట్లుగా తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించగలదా ? 70- 80 సీట్లలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ కు ఆ స్థాయి విజయం దక్కుతుందా ? అనేది చూడాలి.

కపులింగ్ ఓపెన్ చేస్తుండగా ట్రైన్‌ రివర్స్.. నుజ్జునుజ్జు అయిన రైల్వే వర్కర్..