జగన్ కి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..

ఆంధ్రప్రదేశ్ ని రెండు గా చీల్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో కుక్కని చింపిన విస్తరి అయ్యింది.

దిక్కు మొక్కు లేక అనాధ శవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబు పుణ్యమా కేంద్రం పై విమర్సల మహత్యం పరంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

చద్రబాబు కేంద్రం జగన్ రాజకీయాల పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

అందులో బాగంగానే కాంగ్రెస్ ని వీడిన సీనియర్ లీడర్స్ అందరిని ఇప్పుడు మళ్ళీ రాహుల్ కాల్ బాక్ చేస్తున్నారు ఏపీలో పార్టీని బలోపేత చేయండి నేను మీరు ఏమి చెప్పిన చేయడానికి సిద్దం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే.ఈ సీన్ లోకి సైలెంట్ గా చంద్రబాబు ఎంటర్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు కి ఎందుకు మధ్యలో అనుకుంటున్నారా ఏమి లేదండి మాటల మాంత్రికుడు కాంగ్రెస్ సీనియర్ నేత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉండవల్లి అంటే చంద్రబాబు కే కాదు ఎంతో మంది సీనియర్ నేతలకి చెమటలు పడుతాయి.

పోలవరం విషయంలో ఉండవల్లి చంద్రబాబు ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనకి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఉండవల్లి జగన్ తోడుగా ఉంటే ఎన్నికల సమయంలో పార్టీకి మరింత దెబ్బ అని గ్రహించిన బాబు ఉండవల్లి ని కాంగ్రెస్ లోకి తీసుకుంటే పార్టీకి ఎంతో బలం అని సన్నిహితుల ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కి చెప్పించారట.

దాంతో కాంగ్రెస్ ఇప్పుడు ఉండవల్లి చేరికపై ఎక్కువగా శ్రద్ద చూపుతోందని తెలుస్తోంది.!--nextpage ఉండవల్లి కూడా ఆ మధ్య తాను రాజకీయాల్లోనే ఉన్నానని, కానీ ఏ పార్టీ వైపు వెళ్లనని తేల్చి చెప్పారు.

కాబట్టి కాంగ్రెస్ లో ఆశలు చిగురించాయి.మెల్లిగా ఆయనకు నచ్చచెప్తే తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉండవల్లి కనుక పార్టీలోకి చేరితే ఆయన వాగ్ధాటికి కాంగ్రెస్ ఉనికి అయినా నిలబడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ మీద అనేక ఆరోపణలు చేస్తూ బీజేపీతో అంట కాగుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ఉండవల్లే కరెక్ట్ అని అధిష్టానం కూడా బలంగా నమ్ముతోంది.

ఉండవల్లి ఏవైనా ఆరోపణలు చేసినా వాటికి తగిన ఆధారాలు కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు.

లెక్కలతో సహా ప్రశ్నించి ప్రత్యర్థులను ఇరుకునపెడుతుంటాడు.అందుకే ఉండవల్లి వంటి వెపన్ ని జగన్ మీద గురిపెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.

ఆయనతో పాటు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి విభజన సమయంలో పార్టీకి దూరం అయిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సంప్రదింపులు పూర్తి చేసిన కాంగ్రెస్ పెద్దలు ప్రస్తుతం మాజీ ఎంపీ హర్షకుమార్‌ ను కూడా సంప్రదిస్తోంది.

ఏది ఏమైనా సరే ఉండవల్లి గనుకా కాంగ్రెస్ లోకి వెళ్తే.జగన్ కి భారీ నష్టం వాటిల్లడం ఖాయం అత్నున్నారు విశ్లేషకులు.

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!