ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :డాక్టర్ కవ్వంపెళ్లి సత్యనారాయణ పై నిండు అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ హేళనగా మాట్లాడిన తీరును ఖండిస్తూ మనకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఓవైసీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున ఫిర్యాదు చేశారు.
అనంతరం పసుల వెంకటి మాట్లాడుతూ సహచర శాసనసభ్యుని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సభ్యున్నీ అలా మాట్లాడడం సరైనది కాదని మీరు గతంలో శాసనసభకు 6 సార్లు ప్రాతినిధ్యం వహించిన కూడా మీకు సంస్కారం లేకుండా పోయిందని,ఇప్పటికయినా కూడా మీరు బహిరంగంగా కవ్వంపెళ్లి సత్యనారాయణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి రమేష్ సర్పంచులు స్వామి లింగయ్య ఫిషరీస్ మండల అధ్యక్షులు జెట్టి మల్లేశం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మచ్చ రాజేశం, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు లింగం, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లెపు రజనీకాంత్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్ , ఉద్యమకారుడు కంకటి ప్రభాకర్, శ్రీనివాస్ , రమేష్ , పరశురాములు, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణిస్తున్న యూఎస్ మహిళకు షాక్..