‘నోటా’ను వారు ఆపేయాలంటున్నారు.. తలతిక్క ఆలోచనలు
TeluguStop.com
విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతుంది.
ఇక ఈ చిత్రం విడుదల కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూసున్నారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని కూడా జరిగిపోయాయి.రేపు అమెరికాలో షోలు కూడా పడబోతున్నాయి.
ఇలాంటి సమయంలో సినిమాను ఆపేయాలంటూ డిమాండ్ ముందుకు వచ్చింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.
ఈ ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో ‘నోటా’ సినిమా విడుదల చేయడం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని కాంగ్రెస్ నాయకులు మరియు కొందరు ఇతర పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోటా అనేది ఎన్నికల్లో భాగం అనే విషయం తెల్సిందే.పోటీ చేసిన ఏ అభ్యర్థులు కూడా నచ్చకుంటే నోటాను నొక్కే అవకాశం ఉంది.
అందుకే నోటా సినిమా చూడటం వల్ల అంతా కూడా నోటాను ఎంపిక చేసుకునే అవకాశంఉ ందని ఆ నాయకులు లాజిక్‌గా మాట్లాడుతున్నారు.
సదరు నాయకులు చేస్తున్న విమర్శలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.సినిమాకు రాజకీయాలకు ముడి పెట్టడం ఏంటని, నోటా సినిమా చూసిన వారు నోటాను ఎంపిక చేసుకోవడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో విజయ్ దేవరకొండ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మరియు అభిమానికి మీ ఓటు హక్కును వినియోగించుకోండి, నోటాను ఎవరు కూడా ఎంచుకోవద్దంటూ సూచించాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న కుళ్లును కడిగేసే విధంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయట.
అందుకు తగ్గట్లుగా ఉండాలనే నోటా టైటిల్‌ను పెట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అందుకే ఈ చిత్రం తప్పకుండా అదే టైటిల్‌తోనే రావాలని వారు కోరుకుంటున్నారు.తతిక్క ఆలోచనలు మానేసి పని చూసుకోండి నాయకులారా అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.
Br 4 Bet Customer Support And Service Quality (UK)