ఆ జిల్లాలో టీడీపీవైపు చూస్తున్న కాంగ్రెస్ నేత‌లు.. వైసీపీకి షాక్‌

ఏపీ రాజ‌కీయాల్లో రాయ‌ల‌సీమ జిల్లాలు ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే.ఎందుకంటే ఇక్క‌డి నుంచే పెద్ద రాజ‌కీయ నేత‌లు అంద‌రూ కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు.

వైఎస్సార్‌, చంద్ర‌బాబు నాయుడు లాంటి వారంతా కూడా ఇక్క‌డి నుంచే దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావం చేసే స్థాయి దాకా ఎదిగారు.

అయితే వీరంతా కూడా కాంగ్రెస్ నుంచే త‌మ రాజ‌కీయ కెరీర్ మొద‌లు పెట్టారు.

ఆ త‌ర్వాత వేర్వేరు ప్లాట్ ఫామ్‌ల‌లోకి చేరుకున్నారు.కాగా ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే.

క‌నీసం ఉనికి కూడా చాట‌లేని ప‌రిస్థితిలో ఉంది.దీంతో చాలామంది కాంగ్రెస్ నేత‌లు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌లు ఎంచుకుంటున్నారు.

ఇక కార్య‌క‌ర్త‌లు కూడా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారు.ఒక‌ప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు వైఎస్సార్ హ‌యాంలో కడప జిల్లాలో కాంగ్రెస్‌కు తిరుగే లేకుండా పోయింది.

అయితే రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత క‌డ‌ప జిల్లాలో వైసీపీ చాటున కాంగ్రెస్ ఉంది.

కాంగ్రెస్ లోని నాయ‌కులు, నేత‌లు అంద‌రూ కూడా వైసీపీకే స‌పోర్టు చేశారు.జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేసేందుకు 2019 ఎన్నికల్లో 10 కి 10 గెలిచేలా కాంగ్రెస్ నేత‌లు కృషి చేశారు.

"""/"/ అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్‌ను క‌నీసం ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే వాద‌న కూడా ఉంది.

జ‌గ‌న్ త‌మకేమీ చేయ‌ట్లేద‌నే భావ‌న‌లో వారు ఉన్న‌ట్టు తెలుస్తోంది.కేవ‌లం వైసీపీకి స‌పోర్టు చేస్తే త‌మ‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని వారు భావిస్తున్నారంట.

ఈ త‌రుణంలోనే ఆ పార్టీ నేత‌లు అంద‌రూ కూడా టీడీపీ లేదా జనసేనల వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.

ఎలాగూ జ‌న‌సేన ఇప్ప‌ట్లో పుంజుకునే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి రేప‌టి త‌మ పిల్లల రాజ‌కీయ భవిష్యత్ కొర‌కు వారంతా టీడీపీలో జాయిన్ కావాల‌ని చూస్తున్నారంట‌.

చూడాలి మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి రాజ‌కీయం చేస్తారో.

ఆరోజు ఆమె కొట్టడం వల్లే ఇలా తయారయ్యారు.. అనసూయ కామెంట్స్ వైరల్!