ఖమ్మంలో నిరుద్యోగ బహిరంగ సభపై కాంగ్రెస్ నేతల చర్చ

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో నేతల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్లు షబ్బీర్ అలీ, బలరాం నాయక్ వంటి నాయకులు హాజరు అయ్యారు.

ఖమ్మంలో ఈనెల 24న నిర్వహించనున్న నిరుద్యోగ బహిరంగ సభపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

అయితే ఇప్పటికే నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే 1న రంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ నిరసన దీక్షలను నిర్వహించనున్నారు.

వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే వర్షాకాలంలోనూ మీ పాదాలు తెల్లగా మృదువుగా మెరిసిపోతాయి!