కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కేసీఆర్ స్క్రిప్ట్.. డీకే అరుణ
TeluguStop.com
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది వాస్తవమేనన్న డీకే అరుణ ఈటల రాజేందర్ నిజాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని చాలా సార్లు రుజువైందన్నారు.కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గౌతమ్ కృష్ణ అకిరా లకు ఆ స్టార్ డైరెక్టర్ అంటే ఇష్టమా..?