కేటీఆర్‌, రేవంత్ మ‌ధ్య అగ్గి రాజేసిన కాంగ్రెస్‌నేత‌..!

అస‌లే రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య మొద‌టి నుంచి కూడా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

ఇక టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం అయిన త‌ర్వాత ఈ వైరం మ‌రింత ముదిరింద‌నే చెప్పాలి.

వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం సాగిస్తున్నారు.ఇలాంటి త‌రుణంలో కూడా ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగానే ఉంటున్నారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేత చేసిన ప‌ని వీరిద్ద‌రి మ‌ధ్య అగ్గిరాజేసింది.అదేంటి కాంగ్రెస్ నేత రేవంత్‌కు అనుకూలంగా ఉంటారు క‌దా ఇలా ఎందుకు చేశార‌న‌నే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు.

అస‌లు విష‌యం ఏంటో తెలుసుకుందాం.రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను మరింతగా కీల‌కంగా సౌత్ ఇండియాలోనే ఐటీలో నెంబ‌ర్ చేయాల‌నే దిశ‌గా ప‌నిచేస్తున్నార‌ని చెప్పాలి.

అయితే ఆయ‌న హైదరాబాద్ శివారు ఏరియాల్లో చేప‌ట్టిన‌టువంటి ఐటీ సంస్థల ఏర్పాటు ఇప్పుడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఇలాంటి త‌రుణంలో వీటిని పరిశీలించేందుకు ఇప్పుడు పార్లమెంటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప‌నిచేస్తున్న‌టువంటి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను కేటీఆర్ వీటిని ప‌రిశీలించేందు కోసం ఆహ్వానంచారు.

ఇక ఆయ‌న కూడా వ‌చ్చారు. """/"/ ఇక ఆయ‌న వాటిని ప‌రిశీలించిన త‌ర్వాత ట్విట్టర్ వేదిక‌గా తెలంగాణ ప్రభుత్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇదే రేవంత్‌రెడ్డికి అస్స‌లు న‌చ్చ‌లేదు.వాస్త‌వానికి ఆయ‌న మాట‌ల‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

కానీ రేవంత్ దీంట్లో విమ‌ర్శ‌లు గుప్పించారు.శ‌శిథరూర్ తెలంగాణ వ్య‌క్తి కాద‌ని, ఆయనో గాడిద అంటూ తీవ్ర‌మైన ప‌ద‌జాలాన్ని వాడారు.

అలాంటి వారిని వెంట‌నే కాంగ్రెస్ నుంచి త‌రిమేయాలంటూ చెప్పారు.ఇక దీనిపై మంత్రి కేటీఆర్ భ‌గ్గుమ‌న్నారు.

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒక స్థాయి సంఘం స‌భ్యుడిని గాడిద అన్నారంటేనే రేవంత్ వ్య‌క్తిత్వం ఎలాటిదో అర్థం అవుతోంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ వార్ పెరిగింది.దీనికి రేవంత్ ఎలాంటి కౌంట‌ర్ వేస్తారో చూడాలి.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు