హీరోయిన్ అమీషా పటేల్ కు కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి రిక్వెస్ట్?
TeluguStop.com
ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లకు లవ్ ప్రపోజల్స్ రావడం కామన్.ఎందుకంటే వాళ్ళు ఎంతో అందంగా ఉంటూ ఇతరులను తమ అందాల వలలో వేస్తారు కాబట్టి.
దీంతో వాళ్లకు సినీ ఇండస్ట్రీ నుండే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తెగ ప్రపోజల్స్ చేస్తూ ఉంటారు.
కొందరి హీరోయిన్ లకు ప్రపోజల్ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు.మరికొందరు వాటిని సరదాగా తీసుకుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ అమీషా పటేల్ కు కూడా పెళ్లి ప్రపోజల్ ఎదురయ్యింది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం అయింది.
ఈ సినిమాలో తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.
చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు.
కానీ బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పడటం తో టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఇక అక్కడ కూడా పలు సినిమాలలో నటించింది.కానీ స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది.
అంతేకాకుండా తమిళ భాషల్లో కూడా నటించింది. """/"/
ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోకపోగా బోల్డ్ పాత్రలో నటిస్తుంది.
స్పెషల్ సాంగ్ లలో కూడా చేస్తూ తన అందాలను ఆరబోస్తుంది.నాలుగు పదుల వయసులో కూడా ఈ అమ్మడు అందాలను తెగ ఆరబోస్తుంది.
ఇక అమీషా పటేల్ ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.
గతంలో ఈమె ఓ బాలీవుడ్ దర్శకుడు తో ప్రేమలో ఉన్నట్లు బాగా వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.కానీ ఆ దర్శకుడికి ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో అమీషా పటేల్ అతడిని దూరం పెట్టింది.
ఇక అప్పటి నుంచి తాను మళ్లీ పెళ్లి గురించి టాపిక్ తీయనేలేదు. """/"/
ఇక అమీషా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఆ ఫోటోలు చూస్తే మాత్రం కుర్రాళ్ల మతి పోవడం కాయం.
ఎందుకంటే ఇంత లేటు వయసులో కూడా అమీషా అందాలు అలా ఉంటాయన్నమాట.ఇదిలా ఉంటే తాజాగా అమీషా పటేల్ కు మరో ప్రపోజల్ ఎదురయ్యింది.
ఇంతకు ప్రపోజల్ చేసిన వ్యక్తి ఎవరో కాదు దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్.
ఇటీవలే ఆయన పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది.ఇక అతడికి సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక అమీషా పటేల్ కూడా అతనికి బర్త్ డే విష్ చేసింది. """/"/
తన ట్విట్టర్ వేదికగా అమీషా అతడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.
హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్.లవ్ యూ.
నీకు ఇది అద్భుతమైన సంవత్సరం కావాలి అని శుభాకాంక్షలు తెలిపింది.
వెంటనే ఫైజల్.తనకు థాంక్స్ చెబుతూ.
తను బహిరంగంగా, అధికారికంగా పెళ్లి ప్రపోజల్ చేస్తున్నానని అంటూ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేరుగా అడిగేశాడు.
ఆ తర్వాత ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశాడు.కానీ అప్పటికే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ద్వారా నెట్టింట్లో వైరల్ గా మారడంతో ప్రస్తుతం అందరి దృష్టిలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం