కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

బీజేపీ నోటీసులు, టీఆర్ఎస్ సమన్ల డ్రామా నడుస్తోందన్నారు.రెండు పార్టీల నాటకాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు.

బీఎల్ సంతోష్ సిట్ విచారణకు వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.విచారణకు అందర్నీ కార్యాలయాలకు పిలిచి కవితను ఎందుకు పిలవరని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై సిట్ విచారణ చేయిస్తున్నారన్న ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడంపైనా కూడా సిట్ తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ధరణిలో తనవి రెండున్నర ఎకరాలు మాయమయ్యాయని, సెట్ చేస్తామని అధికారులు చెబుతున్నారని షబ్బీర్ అలీ వెల్లడించారు.