కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో ఈటల రాజేందర్ బలి పశువుగా కనిపిస్తున్నారన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు.తాము బీఆర్ఎస్ తో పోరాడుతుంటే మీరు మాపైనే బురద చల్లుతున్నారంటూ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరపలేదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హీరో కారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శించే సాహసం చేయొద్దని సూచించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 3, సోమవారం2025