అక్కడ టికెట్ రాని వారందరి ఆప్షన్ కాంగ్రెస్ ? 

ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే విధంగా ఆ పార్టీ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను( YS Sharmila ) పార్టీలో  ఈ రోజే చేర్చుకుంది.

ఆ పార్టీని విలీనం చేసుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతోంది.షర్మిల ప్రభావం కాంగ్రెస్ పై ఎంత మేరకు పనిచేస్తుందనేది మరి కొంతకాలం గడిస్తే గాని చెప్పలేం.

అయితే ఏపీ అధికార పార్టీ వైసిపి లో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు శ్రీకారం చుట్టడంతో,  అక్కడ టికెట్ దక్కే అవకాశం లేని వారందరికీ,  ఇప్పుడు కాంగ్రెస్ నే ఆప్షన్ గా కనిపిస్తోంది.

ఇప్పటికే టిడిపి , జనసేన టికెట్ల సర్దుబాటు విషయంలో ఒక క్లారిటీకి వచ్చాయి.

  దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి ఇప్పటికే అభ్యర్థులను గుర్తించింది .కొత్తగా పార్టీలో ఎవరు చేరినా, టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు.

దీంతో వైసిపిలో టికెట్ దక్కని వారంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఆప్షన్ గా చూస్తున్నారు.

"""/" / ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది  ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు .

కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు .షర్మిల వెంటే తాను నడుస్తానని ఆళ్ల చెబుతున్నారు.

ఇంకా అనేకమంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.విజయవాడ సెంట్రల్ సీటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మల్లాది విష్ణు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆయన వర్గీయులు కొంతమంది ప్రచారం చేస్తున్నారు .

అలాగే జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ( Gadikota Srikanth Reddy )కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని,  కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది .

"""/" / రాయచోటిలో ఓ ముస్లిం అధికారికి జగన్ సీటు ఇచ్చేందుకు చూస్తున్నారని , దీంతో అసంతృప్తికి గురై కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు శ్రీకాంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

వీరే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్ లో ఊహించని విధంగా చేరికలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో దాహం వేసిన చిరుతపులులకు నీళ్లు ఇచ్చిన డ్రైవర్.. ఉద్యోగం నుంచి సస్పెన్షన్!