బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ? 

బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ? 

అనూహ్యంగా కలిసి వచ్చిన పరిణామాలతో మరింత దూకుడు ప్రదర్శించాలని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నిర్ణయించుకుంది.

బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ? 

దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించి,  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు , ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుంది.

బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ? 

ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి రాష్ట్రమంతా సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు. """/" / ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, ( Mallu Bhatti Vikramarka ) టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.

నిన్న జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ ఉండడంతో కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ( Revanth Reddy )ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మధ్యలోనే పార్లమెంటుకు వెళ్లిపోయారు.

దీంతో ఈ వివరాలను మల్లు భట్టు విక్రమార్క వెల్లడించారు.ఈరోజు మరోసారి దీనిపై సమావేశం అవుతామని వారు తెలిపారు.

తెలంగాణలో ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తామని వారు వెల్లడించారు.

"""/" /  దూరమైన వర్గాలన్నిటిని కాంగ్రెస్ కు దగ్గర చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని,  పోటీ చేస్తామన్న వారందరికీ టికెట్లు ఇవ్వలేమని,  వామపక్షాలతో జాతీయస్థాయిలో నేతలు చర్చలు జరుపుతారని , వారితో ఒక అవగాహన వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్తామని ఈ సమావేశంలో వెల్లడించారు.

ఇక బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ కు జనాల్లో ఆదరణ పెంచడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రస్తుతం అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ( BRS )కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావడంతో ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం ప్రజల్లోనే ఉండేవిధంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది.

ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ కు ఆదరణ పెంచడంతో పాటు , పార్టీ శ్రేణుల్లోను ఉత్సాహం పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!