తెలంగాణలో 119 అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించే యోచనలో కాంగ్రెస్..!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇందులో భాగంగా ఢిల్లీలోని వార్ రూమ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కొనసాగుతోంది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి అయితే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా అందించనున్నారు.

అనంతరం ఏఐసీసీ తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.కాగా నెలాఖరులోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ జాబితాలో కొంతమంది అభ్యర్థులనే ప్రకటిస్తారా? లేక 119 అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటిస్తారా? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే తాజాగా ఆరు గ్యారెంటీ హమీ పథకాలను ప్రకటించింది.

భారతీయుడు 2 లో కమలహాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారా..?