బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్...ఇక సమరమేనా?

తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున అంతేకాక గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా ఇప్పటి నుండే వ్యూహ ప్రతివ్యూహాలను పన్నుతూ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే మొన్నటి వరకు బీజేపీ పెద్ద ఎత్తున ఒంటికాలుపై లేస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ పార్టీని తిరిగి బలమైన రాజకీయ పార్టీ గా తీర్చిదిద్దేందుకు రేవంత్ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరగాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

బీజేపీని ఎంత మేరకు ఎటువంటి వ్యూహాలతో వెనక్కి నెడుతుందనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

అయితే తెలంగాణలో ముఖ్య మంత్రి  కేసీఆర్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఏదో ఒక క్రమంలో కొంత ఆశాజనక ఫలితాలు ఉంటాయనేది ప్రతిపక్షాల ఆలోచనగా అనిపిస్తోంది.

అయితే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ఉన్న బలాబలాలను చూస్తే కాంగ్రెస్ కు ఉన్న కార్యకర్తల బలంతో పోలిస్తే బీజేపీ కార్యకర్తల బలం చాలా తక్కువ.

అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కావడం కాంగ్రెస్ కు కొంత సానుకూల అంశమైనా బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఆ దిశగా సోషల్ మీడియాను కీలకంగా చేసుకుంటూ కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేలా  ఇప్పటికే వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణలో హిందుత్వ విధానవ్యాప్తి ఏ మేరకు సఫలమవుతుందనేది పూర్తిగా ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024