ఖమ్మంలో కాంగ్రెస్ బలపడుతోంది.. :పొంగులేటి

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలపడుతోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణ జనగర్జన సభను సక్సెస్ చేశామని చెప్పారు.

ఈ క్రమంలో సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.గత నాలుగు సంవత్సరాలుగా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉన్నానని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోందని వెల్లడించారు.సభకు రాకుండా చాలా ఇబ్బంది పెట్టారన్న ఆయన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సభను విజయవంతం చేశామని స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024