మెయిన్ రోడ్డు బాధితుల పక్షాన కాంగ్రెస్ ఆందోళన

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి నేటికీ ఏడాది కావస్తున్నా నేటి వరకు భాదితులకు ఇచ్చిన 2013 భూసేకరణ చట్టం హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో పాత మెయిన్ రోడ్డు బాధిత వ్యాపారులకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ,నివాస స్థలంలో చిరు వ్యాపారులు చేసుకుంటూ బ్రతికేవారని,వారు ఆక్రమణదారులు కాదని,ముమ్మాటికీ హక్కుదారులేనన్నారు.

దుకాణదారులకు ఎలాంటి నోటీసులివ్వకుండా అక్రమంగా కూల్చివేసి,మంత్రి జగదీశ్ రెడ్డి వారిని రోడ్డున పడేశారని,ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

అభివృద్ధికి ఎవరూ అడ్డు కాదు.కానీ,నష్టపరిహారం చెల్లించి భరోసా కల్పించాలన్నారు.

నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,మోడల్ మార్కెట్ లో దుకాణాల కేటాయింపు లాంటి హామీలు ఇచ్చి,ఆ హామీలు అమలు చేయకుండా, పనుల్లో కూడా వేగం పెంచకుండా వారికీ ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిసిసి మాజీ అధ్యక్షులు,నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి రోడ్డు బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ,కాంగ్రెస్ కౌన్సిలర్స్,పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భర్త క్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న స్నేహ రెడ్డి..41 రోజులపాటు ఉపవాసం!