Minister Seethakka : మహిళలను అగ్రభాగంలో నిలిపే పార్టీ కాంగ్రెస్..: మంత్రి సీతక్క

తెలంగాణలో మహిళలను అగ్రభాగంలో నిలిపే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి సీతక్క( Seethakka ) అన్నారు.

వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ తమ పాలనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్న మంత్రి సీతక్క పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.

బీఆర్ఎస్( BRS ) నేతలు ఇప్పటికైనా తప్పుడు మాటలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

కావాలనే కాంగ్రెస్ సర్కార్ పై దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్‌: రన్నింగ్ ట్రైన్ పైకెక్కి సెల్ఫీ వీడియో తీసిన ఇండియన్.. వీడియో చూస్తే!