మునుగోడులో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లోకి..? గాంధీ కుటుంబం వల్లే...!!
TeluguStop.com
కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ జిల్లాలో కేడర్ఓటు బ్యాక్ అనుకున్న స్థాయిలో ఉంది.ఏళ్లుగా ఇక్కడ రాజకీయాలను కాంగ్రెస్ నేతలే ప్రభావితం చేశారు.
ఈ జిల్లాలో రెండు ఎంపీ సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకుంది.అయితే ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి పట్టు ఉంది.
అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి.పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
అయితే ఈ క్రమంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ ఇక్కడ గేమ్స్ ఆడుతోందని చెబుతున్నారు.ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపినా పట్టించుకోవడం లేదట.
రీసెంట్ గా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కి మునుగోడులో థర్డ్ ప్లేస్ వచ్చిందని అంటున్నారు.
అయితే ఇప్పటిదాకా మునుగోడు సీటు ఎవరికి ఇస్తారో తెలియదు కాబట్టి దీంతో బీజేపీలోకి జంప్ చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోని అనుకూల నేతలను లాగేస్తున్నాడట.
ఎటొచ్చి కాంగ్రెస్ పరిస్థితే.ఇక టీఆర్ఎస్ కి అధికార బలం.
కేడర్ ఎలాగూ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.దాంతో ఉప ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ లేదా సెకండ్ ప్లేస్ టీఆర్ఎస్ కి రావడం ఖాయం అంటున్నారు.
ఇక కంచుకోటలో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లోని వెళ్తోందని.
అది కేవలం కాంగ్రెస్ లో గాంధీ కుటుంబ రాజకీయాల వల్లనే అని అంటున్నారు.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కానీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ మునుగోడు మొత్తం బాధ్యతలు అప్పగిస్తే వారు గెలిచే క్యాండిడేట్ ని ఎంపిక చేస్తారా.
? ఇక కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని గెలిపించే కార్యక్రమాన్ని ఇంట్లో నుంచే చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ తమ కాంట్రాక్టుల కోసం జాతీయ పార్టీలో ఉండడం బెటర్ అనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.
ఆ మీదట కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్టెప్స్ కూడా ఎలా ఉంటాయో అన్న చర్చ కూడా ఉంది.
మొత్తానికి కాంగ్రెస్ అధినాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పార్టీ కంచుకోటలో మునుగోడు సీటు దూరం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.
ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి… తారక్ నటన మరో లెవెల్ అంటూ!