జోష్ లో కాంగ్రెస్.. మరి బి‌ఆర్‌ఎస్ ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ ( BRS )నుంచి వలసలు పెరుగుతున్నాయి.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గెలుపే లక్ష్యంగా మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి బి‌ఆర్‌ఎస్ విడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

సీట్ల కేటాయింపులో చాలమంది నేతలకు అన్యాయం జరిగిందని అధికార పార్టీలో ముసలం మొదలైంది.

అయితే అభ్యర్థులను ప్రకటించిన రోజే జాబితాలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయని కే‌సి‌ఆర్( CM Kcr ) స్పష్టం చేసినప్పటికీ.

చాలమంది నేతలు పార్టీ విడుతున్నారు.దీంతో అధికార బి‌ఆర్‌ఎస్ లో కలవరం మొదలైంది.

"""/" / ఈసారి వందకు పైగా సీట్లు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కే‌సి‌ఆర్ ఉన్న నేపథ్యంలో పార్టీకి సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా దురమౌతుండడం బి‌ఆర్‌ఎస్ కు గట్టి దేబ్బెనని విశ్లేషకులు చెబుతున్నారు.

పాలేరు సీటు ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) కారు దిగి హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మరో కీలక నేత మైనమపల్లి హనుమంతరావు( Mynampalli Hanumanthrao ) కూడా బి‌ఆర్‌ఎస్ కు రాజీనామా చేశారు.

ఆల్రెడీ మల్కాజ్ గిరి సీటు మైనంపల్లికి ప్రకటించినప్పటికి తన కుమారుడు రోహిత్ కు మెదక్ సీటు ఇవ్వకపోవడంతో ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చారు.

"""/" / త్వరలో మైనమపల్లి కూడా తన కుమారుడితో పాటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాట్లాడుతూ మైనంపల్లి తమ పార్టీలోకి వస్తే ఆశించిన సీటు ఇస్తామని ఇటీవల చెప్పుకొచ్చారు.

మరి మైనంపల్లి అడుగులు ఎటు పడతాయో చూడాలి.ఇక బి‌ఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ వేమూరి వీరేశం కూడా అధికార పార్టీ వీడి హస్తం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలా బి‌ఆర్‌ఎస్ లోని కీలక నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో హస్తం నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎన్నికలు మరింత దగ్గర పడే కొద్ది ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ఈసారి అధికారం కోసం గట్టిగా పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ.( Congress Party ) బి‌ఆర్‌ఎస్ పై ఎలా పైచేయి సాధిస్తుందో చూడాలి.

ఆలయ పురోహితునికి దక్షిణగా 500 నోట్ల కట్ట ఇచ్చిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?