బీఆర్ఎస్ అసంతృప్తులపై కాంగ్రెస్ ఆశలు ! దరఖాస్తు చేయకున్నా టికెట్ ?
TeluguStop.com
మరి కొద్ది నెలల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు మొదలుపెట్టారు.ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో హడావుడి పెంచింది.
115 మంది అభ్యర్థులను కేసీఆర్( KCR ) ప్రకటించారు.ఇక పూర్తిగా వారిని జనాల్లో ఉండే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించారు.
ఈ విధంగా బిఆర్ఎస్ దూకుడుగా ఉండడంతో , కాంగ్రెస్ కూడా వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
"""/" /
ఈనెల 25 వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .
ఈ దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హులను ఎంపిక చేసి, వచ్చే నెల మొదటి వారంలో జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేరళకు చెందిన కరుణాకర్ నేతృత్వంలో ఏర్పాటు అయిన స్క్రీనింగ్ కమిటీకి అప్పగించారు.
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఐదు నుంచి పదిమంది వరకు ఆశావాహులు టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
దీంతో అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కాస్త ఇబ్బందికరంగా మారింది.ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ వైపే చూస్తారని, ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ తో సంప్రదింపులు చేస్తున్నారని , అటువంటివారు ఈనెల 25 లోపు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోయినా, వారికి వారి బల, బలగాలను బట్టి టికెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
"""/" /
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం బీ ఆర్ఎస్ నుంచి చాలా మంది కీలక నాయకులే బయటకు వస్తారని , వారంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లోనే చేరుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు సీట్లు ఖరారు చేయడంతో, ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు బాగా కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
తప్పులు సరిదిద్దుకుంటున్న జగన్ .. సీనియర్లకే ఆ ఛాన్స్