డీకే చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ ? 

తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా చేసేందుకు కాంగ్రెస్( Congress ) అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ ఉండడం, సీనియర్, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు పెరగడం , ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆకాంక్ష కంటే, తమ పంతం నెగ్గాలి అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరగడం, ఇవన్నీ పార్టీకి ఇబ్బందికర పరిణామాలుగానే ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది.

దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతుంది.ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా వ్యూహాలు అన్నీ సక్సెస్ అయిన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ పెరుగుతోంది.

దీనిపై త్వరలోనే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలంటే, శివకుమార్( D.

K.Shivakumar ) ను ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయించుకుందట.

"""/" / శివకుమార్ కు రాజకీయ వ్యూహాల్లో మంచి పట్టు ఉండడం, అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధాలు ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటోంది.

అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నాయకత్వాన్ని విబేధిస్తున్న సీనియర్ నాయకులు శివకుమార్ కు బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదనను తీసుకొస్తూ ఉండడంతో, డీకే శివకుమార్ కు సీనియర్లను సమన్వయం చేసుకోవడం, ఎన్నికల వ్యూహాల బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమైందట.

అలాగే పార్టీకి ఆర్థిక పరమైన వనరులను సమకూర్చడంలోనూ డీకే సేవలు ఉపయోగపడతాయనే అంచనా వేస్తోందట.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు అంతా డీకే శివకుమార్ తో టచ్ లోకి వెళ్లారట.

అలాగే కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ), జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి వంటి వారు బెంగుళూరు వెళ్లి శివకుమార్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది.

"""/" / శివకుమార్ నియామకం ద్వారా పార్టీ నాయకులు మధ్య సమన్వయం పెంచడం, ఎన్నికల వ్యూహాలు అమలు చేయడం వంటివన్నీ జరుగుతాయని అంచనా వేస్తోందట.

ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకుల మధ్య సమన్వయం కనిపించడం లేదు.రేవంత్ రెడ్డి నాయకత్వం వ్యతిరేకిస్తున్న వారు ఎక్కువగా ఉండడం, అంతర్గత విభేదాలతో తరచుగా పార్టీ నాయకుల మధ్య విబేధాలు చోటు చేసుకోవడం వీటన్నిటిని అంచనా వేసే శివకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోందట.

వీడియో వైరల్.. ‘మోడల్ చాయ్’ అంట భయ్యా.. చూసారా?