కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ !

తెలంగాణలో ఎన్నికల( Telangana Elections )  ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది.

రేపటితో పార్టీల ప్రచారానికి తెర పడనుంది.కాగా ఇప్పటివరకు ప్రచారల్లో ప్రధాన పార్టీలు చేసిన హామీలు, విమర్శలు బలంగానే ప్రజల్లోకి వెళ్ళాయి.

ముఖ్యంగా కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ మద్య చెలరేగిన పోలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు.

ఈసారి బి‌ఆర్‌ఎస్ ను గద్దె దించే లక్ష్యంగా కాంగ్రెస్ చేసిన విమర్శలు గులాబీ పార్టీని తీవ్రంగానే ఇబ్బంది పెట్టాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం, ధరణి పోర్టల్ అవినీతి, ఉద్యోగ నోటిఫికేషన్ల విఫలం.ఇలా బి‌ఆర్‌ఎస్ ను ఇరుకున పెట్టెలా కాంగ్రెస్ సంధించిన అస్త్రాలు బి‌ఆర్‌ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేశాయనే చెప్పాలి.

అటు కాంగ్రెస్ సంధించిన అస్త్రాలకు బి‌ఆర్‌ఎస్ కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నప్పటికి పెద్దగా ఇంపాక్ట్ చూపడం లేదు.

"""/" / ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో కే‌సి‌ఆర్ సర్కార్ ను వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టారనే చెప్పవచ్చు.

నిరుద్యోగులను ఆధుకోవడంలో బి‌ఆర్‌ఎస్ పూర్తిగా విఫలం అయిందని, గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, నిరుద్యోగులే కే‌సి‌ఆర్ కు బుద్ది చెబుతారని.

ఇలా కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే నిరుద్యోగులే లక్ష్యంగా కాంగ్రెస్ వేసిన ప్లాన్ కు బి‌ఆర్‌ఎస్ ధీటైన సమాధానం ఇస్తూ కే‌టి‌ఆర్ ఇటీవల సంధించిన ప్రశ్నలు హస్తంపార్టీని సెల్ఫ్ గోల్ వేసుకునేలా చేశాయని తెలుస్తోంది.

"""/" / తెలంగాణలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో 2 లక్షలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశామని, 1 లక్షకు పైగా ఉద్యోగనియమకాలు చేపట్టమని కే‌టి‌ఆర్( KTR ) ఆధారాలతో సహ ఇటీవల బయట పెట్టారు.

ఆ విధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎంతమేర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారో చూపాలని కే‌టి‌ఆర్ ప్రశ్నించడం.

కాంగ్రెస్ ను ఇరుకునే పట్టేలా కనిపిస్తోంది.పక్కనే ఉన్న కర్నాటకలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హస్తం పార్టీ.

ఆర్నెల్లు గడిచిన కర్నాటకలో ఆ ఊసే లేదని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.దీంతో ఉధోగ నోటిఫికేషన్ల విషయంలో బి‌ఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ మరింత దారుణంగా ఉందనే విషయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంది.

మొత్తానికి ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో హస్తం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఆ ఒక్క మాటతో … విజయసాయిని జగన్ పక్కన పెట్టేస్తారా ?