కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసింది..: మందకృష్ణ మాదిగ

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు.

కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే మాదిగలకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని భావించినట్లు చెప్పారు. """/" / కానీ స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూలును మల్లు రవి( Mallu Ravi )కి కేటాయించారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో మాదిగలకు సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాలలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) కుమ్మక్కయారన్న ఆయన 12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలకే కేటాయించారని ఆరోపించారు.

అయితే తామేంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తామని తెలిపారు.

పల్నాడు హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్