కాంగ్రెస్ పేదరికాన్ని పెంచి పోషించింది..: కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్

తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్( Rajnath Singh ) అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రజల సొమ్ము దోచుకుందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్( Congress ) పేదరికాన్ని పెంచి పోషించిందని రాజ్‎నాథ్ సింగ్ విమర్శించారు.

అయితే తాము పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకొచ్చామన్నారు.మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ( Telangana ) అభివృద్ధి పథంలో కొనసాగాలంటే అది కేవలం బీజేపీతో సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను చేశారు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం