కాంగ్రెస్ కు ప్రజల మీద ప్రేమ లేదు..: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని జలవిహార్ లో న్యాయవాదులతో మంత్రి కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు.

తాము చాలా ప్రయత్నాలు చేసిన తరువాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ ముందుకు వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ మేరకు కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ రెండస్తుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

హైదరాబాద్ లో తలపెట్టిన ఫాక్స్ కాన్ ప్లాంట్ ను బెంగళూరుకు తరలించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంస్థకు లేఖ రాశారని తెలిపారు.

కాంగ్రెస్ వాళ్లకు బెంగళూరు అడ్డగా మారిందన్న కేటీఆర్ బెంగళూరులోనే టికెట్ల కేటాయింపు, డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో డబ్బులు దొరుకుతున్నాయని తెలిపారు.సీఎం పదవి కోసం కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు జరిగాయన్నారు.

కాంగ్రెస్ కు పదవుల మీద తప్ప ప్రజల మీద ప్రేమ లేదని కేటీఆర్ విమర్శించారు.

దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!