11 సార్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమీ లేదు..: కేటీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సాగునీటి పంచాయతీ లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చగా కనిపిస్తోందని పేర్కొన్నారు.పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.కరెంట్ లేక కర్ణాటక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల పాటు మాత్రమే కరెంట్ ఉంటుందన్నారు.

ఈ క్రమంలో 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? లేక మూడు గంటలే కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? అనే విషయాన్ని ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.

పుష్ప2 రిలీజ్ వేళ సంచలన పోస్ట్ పెట్టిన నాగబాబు… మళ్లీ కలుసుకోలేవు అంటూ!