హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసింది..: హరీశ్ రావు
TeluguStop.com
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
మెదక్ పార్లమెంట్( Medak Parliament) నియోజకవర్గంలో ఈసారి కూడా బీఆర్ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంత ఎత్తుకు లేచిందో.అంతగా తుస్సుమనిపించిందని విమర్శించారు.
వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస మోసం చేసిందని ఆరోపించారు.
"""/" / ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి, పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలని సూచించారు.
రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో సమస్యలపై పార్లమెంట్ లో గళం వినిపించే వారినే గెలిపించాలని కోరారు.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?