కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు: ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని దేవరకొండ ఎమ్మేల్యే బాలూ నాయక్ అన్నారు.

సోమవారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో గ్రంధాలయ ప్రారంభం, నక్కలపెంటతండా గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, అనంతరం పీఏపల్లి మండల కేంద్రంలో కోపరేటివ్ సొసైటీలో నూతనంగా రూ.

22 లక్షల 58 వేలతో ఏర్పాటు చేసిన నూతన గోదాములను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిందని, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

ప్రతిపక్ష పార్టీలు రైతుబంధు రాదని, రుణమాఫీ కాదని ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని,మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పదని,రుణ మాఫీపై అపోహలు వద్దన్నారు.

ఈ గోదాములు రైతుల ఎరువులకు,మందు బస్తాలకు ఉపయోగపడుతుందని,ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి మాటను చిత్తశుద్ధితో నిలబెట్టుకోవడానికి ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలలకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆనాడు రాజశేఖరరెడ్డి హయాంలో రుణమాఫీ జరిగిందని, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ జరుగుతుందన్నారు.

రైతులకు సంబంధించి రుణమాఫీ జరగకపోతే మండలం వ్యవసాయ శాఖ అధికారి అందరికీ అందుబాటులో ఉంటూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వాన్ని చేరవేసి నిజమైన అర్హులకు రుణమాఫీ జరిగేలా చూడాలని అదేశించారు.

ఏమైనా సందేహాలు ఉంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ 7288800023 తమ సమస్యలను నేరుగా చెప్పుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమానికి నల్గొండ డిసిసి బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,కిరణ్ కుమార్ హాజరై మండలానికి కావాల్సిన రెండు కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య,ప్రధాన కార్యదర్శి సతీష్,చైర్మన్ మణిపాల్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,వైస్ ఎంపీపీ నరసింహ, యాదగిరి,రాజశేఖర్ రెడ్డి, సాయి,డైరెక్టర్లు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?