CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ సర్కార్ వైరుధ్యం పెట్టుకోదు..: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రం, రాష్ట్రం మధ్య ఘర్షణలు ఉంటే ప్రజలు నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ( BRS ) నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని చెప్పారు.

విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్లకు బదులు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించామని తెలిపారు.

మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకరించాలన్నారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు.

కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదని తెలిపారు.అభివృద్ధిలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామన్నారు.

"""/" / స్కైవేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటులో ప్రధాని ( Narendra Modi )సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి పట్ల ప్రభుత్వం గౌరవ ప్రదంగా వ్యవహరిస్తుందని చెప్పారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.

అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం ఎలాంటి వైరుధ్యం పెట్టుకోదని తెలిపారు.

కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు.

బాలయ్య రేంజ్ ఇంతలా పెరిగిందా.. అన్ని వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారా?