పైరవీలకు చెక్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆ నేతలకే..?
TeluguStop.com
కాంగ్రెస్ ( Congress ) దేశంలోని జాతీయ పార్టీలలో అతిపెద్ద జాతీయ పార్టీ.
కాంగ్రెస్ లో ఏ పని చేయాలన్న ఏకపక్ష నిర్ణయాలు అస్సలు ఉండవు.దేనికైనా ఓ కమిటీ ఉంటుంది.
ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే నాయకులంతా ముందుకు కదలాలి.అలా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎంతో మంది నాయకులు దేశాన్ని పాలించి ఎంతో అనుభవం కలిగి ఉన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో ఉండి బిజెపి ( BJP ) అధికారంలో ఉంది.
ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా కేంద్రంలో మరియు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆలోచనలు చేస్తోంది.
దీని ప్రకారమే గల్లి నుంచి ఢిల్లీ( Delhi ) దాకా కొత్త కొత్త వ్యూహాలు చేస్తోంది.
"""/" /
ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ( Telangana State ) లో టీపీసీసీ గా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అయిన తర్వాత కాస్త ఊపు వచ్చింది.
బిఆర్ఎస్ ను ఢీకొట్టేది కాంగ్రెస్ అనే విధంగా తయారయింది.దీంతో కాంగ్రెస్ తెలంగాణలో రెండు పర్యాయాలు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, ఈ ఎన్నికల్లో అలాంటి తప్పులు చేయవద్దని భావించి ఏదైనా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోంది.
టికెట్ల విషయంలో కూడా పైరవీలకు స్థానం లేకుండా చేసింది.పార్టీ కోసం కష్టపడే వారికి తప్పనిసరిగా టికెట్లు దక్కుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు.
దాని ప్రకారమే టికెట్ల కేటాయింపు జరుగుతుందని సమాచారం.అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే.
దీంతో చాలా నియోజకవర్గాల్లో రెండు మూడు నుండి 10 వరకు దరఖాస్తులు వచ్చాయి.
"""/" /
ఆ దరఖాస్తులను బట్టి ప్రతి నియోజకవర్గంలో అధిష్టానం సీక్రెట్ సర్వే చేసి జనాధారణ ఉన్న నాయకులకి స్క్రీనింగ్ కమిటీ టికెట్లు కేటాయిస్తుందనేది పక్కా అంటూ కాంగ్రెస్ (Congress) అధినాయకత్వం సిగ్నల్ అందిస్తోంది.
ఇప్పటికే ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ మంచి గుర్తింపు సాధించారు.
ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు.అలా జన ఆదరణ పొందిన లీడర్లకు తప్పనిసరిగా టికెట్లు వస్తాయని అధిష్టానం అంటున్నట్టు తెలుస్తోంది.
బిఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం ఏ విధంగా అయితే సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తుందో కాంగ్రెస్ కూడా ఆ విధంగానే పూర్తిస్థాయి సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని కేటాయింపు చేయబోతోంది.
అంతకుముందు ఎలక్షన్స్ సమయంలో పైరవీలకు డబ్బున్న నాయకులకు టికెట్లు కేటాయించి కాంగ్రెస్ బంగపడింది.
ఈసారి అలా జరగకూడదనే స్క్రీనింగ్ కమిటీని వేసి సర్వే ఆధారంగా ఏ నాయకుడికైతే మంచి పట్టు ఉంటుందో ఆ నాయకుడికి తప్పనిసరిగా టికెట్ వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
జూనియర్ ఎన్టీయార్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…