మునుగోడుపై కాంగ్రెస్ ఫోక‌స్..

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా ప్ర‌క‌ట‌న‌తో మునుగోడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి.ఉపఎన్నిక అనివార్యం కావ‌డంతో అధికార‌, విప‌క్ష పార్టీలు త‌మ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే మునుగోడుపై కాంగ్రెస్ దృష్టి సారించింది.రాజగోపాల్ రెడ్డితో ట‌చ్ లో ఉన్న మండ‌ల అధ్య‌క్షుల‌పై ఇప్ప‌టికే స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

అదేవిధంగా అభ్య‌ర్థి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న కాంగ్రెస్.రాజగోపాల్ రెడ్డితో ట‌చ్ లోకి వెళ్తున్న వారిపై ఫోక‌స్ పెట్టింది.

మ‌రోవైపు, రేపు మునుగోడులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న విస్తృత స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌మావేశంలో ముఖ్యంగా అభ్యర్థిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.మునుగోడు అభ్య‌ర్థులుగా స్ర‌వంతి, కైలాష్, ప‌ల్లె ర‌వి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని చెబుతున్నారు.

అయితే ఈ స‌మావేశానికి కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ‌స్తారా లేదా అన్న‌దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.