కాంగ్రెస్ కసరత్తులు.. ఏంటా వ్యూహం ?
TeluguStop.com
తెలంగాణలో అధికారంలోకి రావాలని హస్తం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.
ఈసారి హస్తం నేతల అంచనాలకు తగ్గట్టుగానే పార్టీపై ప్రజల్లో కూడా మద్దతు పెరుగుతూ వస్తోంది.
దీంతో ఈసారి బిఆర్‌ఎస్( BRS ) కు చెక్ పెట్టడం గ్యారెంటీ అని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలు ప్రకటించి మేనిఫెస్టో తయారు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయనికి ప్రధాన కారణం అక్కడ ప్రకటించిన హామీలే. """/" / దాంతో తెలంగాణలో కూడా హామీలపైనే ఎక్కువగా దృష్టి సరిస్తోంది హస్తం పార్టీ.
ఒకవైపు బరిలో నిలిచే అభ్యర్థులపై దృష్టి సారిస్తూనే మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై ఫుల్ ఫోకస్ పెట్టింది.
అభ్యర్థుల విషయంలో ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన హస్తం పార్టీ.త్వరలోనే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే కేంద్రం జమిలి ఎన్నికల( Jamili Elections )పై దృష్టి సారించడంతో అభ్యర్థుల ప్రకటనను హోల్డ్ లో ఉంచారు కాంగ్రెస్ నేతలు.
ఈలోగా మేనిఫెస్టోపై కసరత్తులు చేసి ప్రకటించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 17 న తుక్కుగూడ సభకు సోనియా గాంధీ ( Sonia Gandhi )రానున్నారు.
"""/" / ఆమె సమక్షంలో మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
అయితే ప్రస్తుతం మేనిఫెస్టోలో చాలా హామీలను కర్నాటకలో ప్రకటించిన హామీలనే చేర్చినట్లు వినికిడి.
గృహాలక్ష్మి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, వంటి వాటినే మెయిన్ గా హైలెట్ చేయాలని భావిస్తున్నారట హస్తం నేతలు.
మరి గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ చేస్తున్న కసరత్తులు.ఆ పార్టీకి ఎంతవరకు విజయాన్ని అందిస్తాయో చూడాలి.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి అంతటి విజయం దక్కించుకోవడానికి హస్తం పార్టీ వ్యూహరచన ఎలా ఉండబోతుందో చూడాలి.
అవిసె గింజలతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. తెలుసా?